← Back to news

ఇన్‌స్టామార్ట్‌లో హైజీన్‌ ఫెయిల్‌.. లైసెన్స్‌ సస్పెండ్‌

By Lokesh· 17h ago

TG: హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ డార్క్‌ స్టోర్‌లో హైజీన్‌ సరిగ్గా పాటించలేదని వీడియోలు వైరల్‌ అయ్యాయి. ర్యాక్‌లపై దుమ్ము, ధూళి ఉండటంతోపాటు ఫ్రూట్స్‌, వెజిటబుల్స్‌ను ప్యాకేజ్డ్‌ ప్రొడక్ట్స్‌ పక్కనే ఉంచినట్లు కనిపించింది. దీనిపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి, స్టోర్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనతో క్విక్‌ కామర్స్‌ స్టోర్లలో ఫుడ్‌ సేఫ్టీ, హైజీన్‌పై మరోసారి ప్రశ్నలు వచ్చాయి.

More in Viral