మధ్యప్రదేశ్‌లో గాడిదకు నర్స్ సర్టిఫికేట్

మధ్యప్రదేశ్‌లో ఓ గాడిదకు నర్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చింది. NSUI రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి పర్మార్ నర్సింగ్ కౌన్సిల్ సైట్‌లో గాడిద ఫోటో అప్‌లోడ్ చేసి, కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి, ఫీజు కట్టారు. వెంటనే గాడిద పేరుతో సర్టిఫికేట్ వచ్చింది. ఈ విషయం వైరల్‌గా మారింది. దీనిపై నర్సింగ్ కౌన్సిల్ అధికారులు రియాక్ట్ అయ్యారు. ఇది Provisional Certificate మాత్రమే అని, వెరిఫికేషన్ తర్వాతే అసలు సర్టిఫికేట్ ఇస్తామన్నారు. ఫేక్ సమాచారం ఇవ్వడం మోసమన్నారు.
