చందుపట్లలో ఉచిత కంటి వైద్య శిబిరం!

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం చందుపట్ల గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం జరగనుంది. సర్పంచ్ ఉదయశ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, కామినేని హాస్పిటల్ సౌజన్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 30న ఉదయం 8:30 గంటలకు పాత గ్రామపంచాయతీ ఆఫీసులో ఈ క్యాంప్ జరుగుతుంది. కంటి సమస్యలు, సాధారణ ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యులతో ఉచిత పరీక్షలు చేయిస్తారు. ఉచిత మందులు కూడా పంపిణీ చేస్తారు.



