కొత్త మ్యూజికల్ రియాలిటీ షో స్టార్ట్ చేస్తున్న రెహమాన్

ఆస్కార్ అవార్డు విజేత, సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కొత్తగా ‘తమిళ్ ఐడల్’ అనే మ్యూజికల్ రియాలిటీ షోను స్టార్ట్ చేశారు. ఈ షో ద్వారా కొత్త తమిళ గాయకులకు అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రెహ్మాన్ సోనీ విళాతో కలిసి పని చేస్తున్నారు. తమిళ్ ఐడల్ షోకు రెహమాన్ లీడ్‌గా ఉంటారు. “లక్షల మందిని చేరుకునే సంగీతం కోసం వెతకడం కొత్తగా ఉంది. ఈ ప్రయాణం ద్వారా కొత్త ప్రతిభను, కొత్త దృక్కోణాలను, ఎన్నో తరాల నుంచి చెప్పని కథలు బయటికొస్తాయి” అని రెహమాన్ అన్నారు.



