రష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు
TG: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన నలుగురు యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారు. హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఏజెంట్లు.. ఒక్కొక్కరి నుంచీ 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. రష్యాకి తీసుకెళ్లి.. క్యాంపులో ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు డ్రామాలాడి.. సైలెంటుగా పారిపోయారు. డొనెట్స్క్‌లో ఉన్న బాధితులు.. ప్రభుత్వమే తమను కాపాడాలని కోరుతున్నారు. తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

