పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.. సూర్యాపేటలో!

సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. SI, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, SP కె. నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 45 రోజుల పాటు ప్రిలిమ్స్ క్రాష్ కోర్సు, ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ ఉంటుంది. సూర్యాపేట జిల్లా వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ లింక్ suryapet.telangana.gov.in లో ఉంది. నేటి నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.



