క్వాంటం కంప్యూటింగ్‌లో AP జోరు.. స్టూడెంట్స్ అద్భుత ప్రతిభ!

AP: క్వాంటం కంప్యూటింగ్‌లో AP స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో సత్తా చాటారు. IITలు, IISc జాయింట్ పార్ట్‌నర్‌షిప్‌తో NPTEL నిర్వహించిన నాలుగు వారాల ‘Quantum Algorithms & Qiskit’ కోర్సుకు దేశవ్యాప్తంగా 1,04,220 మంది అప్లై చేసుకోగా, రాష్ట్రం నుంచి 19 వేల మంది హాజరయ్యారు. వారిలో 2,839 మంది అర్హత సాధించారు. నలుగురు గోల్డ్, 14 మంది సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. నూజివీడు RGUKT స్టూడెంట్స్ ఏకంగా 7 సిల్వర్ మెడల్స్ సాధించారు. పతక విజేతలు CM చంద్రబాబును కలిశారు.




