ధర్మారంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గొర్రెలు, మేకలకు రాష్ట్రప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిన సందర్భంగా గొర్రెల పెంపకదారుల సంఘం, అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గొల్లకురుమల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా బీమా పథకాన్ని అమలు చేశారని తెలిపారు. బీమా సౌకర్యం కల్పించడం వల్ల గొర్రెలు, మేకల పెంపకదారులకు ప్రయోజనం కలుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.



