ఓ గాంధీ మా మొర విను.. అంగన్వాడీల నిరసన

గుంటూరులో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమస్యలపై సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు పెంచాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని, సిబ్బందిపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.


