గర్భవతి అయిన స్కూల్ చిన్నారి.. ఇద్దరిపై పోక్సో కేసు!

నల్లగొండ జిల్లా అనుముల మండలంలో ఘోరం జరిగింది. ఒక స్కూల్ గర్ల్‌ను ఇద్దరు యువకులు బెదిరించి, పలుమార్లు రేప్ చేశారు. మొదట ఒక యువకుడు మాయమాటలతో లొంగదీసుకోగా, ఆ విషయం తెలిసిన మరో యువకుడు బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. రీసెంట్‌గా ఆ బాలిక ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పేరెంట్స్ కంప్లైంట్‌తో అలర్ట్ అయిన పోలీసులు నిందితులపై POCSO యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఇన్సిడెంట్‌పై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



