అభివృద్ధి పనులకు MLA శంకుస్థాపన

కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో 35.27 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు MLA ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్లు, కాలువలు, పైపులైన్ల అభివృద్ధి పనులతో పాటు పెద్దపసువుల రోడ్డులో అర్జన్ హెల్త్ సెంటర్, సమగ్ర నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జమ్మలమడుగు మండలంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 1,450 టిడ్కో ఇళ్లు నిర్మించగా, మొదటి విడతగా 520ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు.



