← Back to news

ప్రయాణికుల్లా వచ్చారు… డ్రైవర్‌ను ఎందుకు చంపేశారు?

By Nani Garikina· 22 Aug 2026
ప్రయాణికుల్లా వచ్చారు… డ్రైవర్‌ను ఎందుకు చంపేశారు?

ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల క్యాబ్ డ్రైవర్‌కు జైపూర్ ట్రిప్ అంటూ ఆఫ్‌లైన్ బుకింగ్ వచ్చింది. జూలై 20న సరితా విహార్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకున్న అతడిని మధ్యలోనే దాడి చేసి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని రాజస్థాన్‌లోని అడవుల్లో పడేసి, కారును కూడా తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. డబ్బుల కొరతతో కారును దోచుకోవాలనే ప్లాన్‌లోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 5h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.