← Back to news

పిల్లల క్యాన్సర్‌పై అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి AIIMS ఆసుపత్రిలో అంగన్‌వాడీ టీచర్లకు పిల్లల్లో క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. మెడికల్ సోషల్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారుల్లో క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించే అంశాలపై అవగాహన కల్పించారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.

More in Local