రాజుగూడ పంచాయతీ భవనం ప్రారంభించాలని వినతి

TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడ నూతన గ్రామపంచాయతీ భవనాన్ని వెంటనే ప్రారంభించాలని సర్పంచ్ జైనేని రాజవ్వ-భీమయ్య, ఉపసర్పంచ్ మర్సుకోల్ల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు తట్ర శంకర్, మార్నేని పద్మ, భీమక్క, ఆడాయి అనసూర్యతో పాటు మాజీ సర్పంచ్ మర్సుకోల్ల లచ్చు పటేల్, బట్టు రాజయ్య, అడాయి శంకర్, గడ్డం భీమయ్య, హన్మంతరావు తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.



