← Back to news

ఇది హక్కుల పోరాటం: షబానా ఆజ్మీ

By Vishi· 2h ago

ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన నిరసనలో సీనియర్ నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మీ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “ఇది మన ప్రజాస్వామ్యం గురించి. మన హక్కుల గురించి. మన స్వరం గురించి. చిన్నప్పటి నుంచి ఓటు వేయాలని, హక్కులు కోరాలని, స్వరం వినిపించాలని చెప్పారు. కానీ మన ప్రాథమిక హక్కును తీసేస్తే లేదా తారుమారు చేస్తే ప్రజలు ఏం చేస్తారు? నిరసన చేస్తారు. ఈ ప్రజాశక్తిని ఇప్పుడు ఆపలేం. ఒకసారి మంట పుట్టింది కదా, అది ఎలా వ్యాపిస్తోందో చూడండి” అని అన్నారు.

More in Current Affairs