తెలుగు నేర్చుకుంటూ ఆనందిస్తున్నా : సొనాలి కులకర్ణి

హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది పారడైజ్' సినిమాతో నటి సొనాలి కులకర్ణి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు భాష నేర్చుకుంటున్నానని, ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీ తనని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించిందని, హైదరాబాద్ సొంత ఇంటిలా అనిపిస్తోందని తెలిపారు. షూటింగ్ సమయంలో ముద్దపప్పు తన ఫేవరెట్ ఫుడ్‌గా మారిందని అన్నారు.



