ఎనుమాముల మార్కెట్ బంద్.. కారణాలివే!

వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. మార్కెట్ ఛైర్పర్సన్ ఎర్ర ప్రియాంక మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి ప్రభుత్వ సెలవు, 3న శనివారం వారాంతపు యార్డు బంద్, 4న ఆదివారం వారాంతపు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్ 5న మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు గమనించాలని సూచించారు.



