← Back to news

కూతురు కోసం పోరాడే తల్లి

By Balakrishna· 26 Aug 2026

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘గాంధారి’. ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో తాప్సీ కంటిచూపు లేని తల్లి పాత్రలో కనిపించనుంది. కిడ్నాప్‌కు గురైన తన కూతురిని కాపాడుకోవడానికి, చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాపై ఆ తల్లి ఎలాంటి పోరాటం చేసిందనేదే ఈ సినిమా కథ. ఇందులో ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా కీలక పాత్రల్లో నటించారు. దేవాశిష్ మఖీజా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం, సెప్టెంబర్ 3 నుంచి డైరెక్ట్‌గా Netflix లో స్ట్రీమింగ్ కానుంది.

More in Entertainment