← Back to news

ఆటో డ్రైవర్ల హామీలు అమలు చేయాలి

By A VIJAY KUMAR· 2h ago· Narsampet (Ct), Narsampet, Warangal
ఆటో డ్రైవర్ల హామీలు అమలు చేయాలి

TG: ఆటో డ్రైవర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని BRTU జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు. నవ తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మల్లంపల్లి రోడ్డు వద్ద ఆదివారం నిరసన చేపట్టారు. పెరిగిన ఇంధన ధరలు, విడిభాగాల ఖర్చులు, ఫైనాన్స్‌ భారాలతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యువరాజు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో డ్రైవర్ల ఆదాయం మరింత తగ్గిందన్నారు. ప్రతి డ్రైవర్‌కు ఏటా రూ.12 వేల జీవనభృతి, ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

More in Local