← Back to news

సమ్మె బాట పట్టిన VRAలు

By Saraswathi· 2h ago· Razole, Razole, Dr. B.R. Ambedkar Konaseema
సమ్మె బాట పట్టిన VRAలు

కోనసీమ జిల్లా రాజోలులో గ్రామ రెవెన్యూ సహాయకులు సమ్మె చేపట్టారు. బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి ఆందోళన చేస్తున్నారు. వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో ఈ సమ్మె జరుగుతోంది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. కానీ కుటుంబానికి సరిపడే వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. CM, Dy CM తమ సమస్యలను పరిశీలించి న్యాయం చేయాలన్నారు.

More in Local