← Back to news

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు

By Khaleel Shaik· 10h ago· Moinabad, Ranga Reddy
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు

రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ ఎలమొని సుదర్శన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. భవన నిర్మాణంపై నోటీసులు జారీ చేయకుండా ఉండేందుకు వాణి రూ.75 వేలు డిమాండ్ చేసి, సుదర్శన్ ద్వారా తీసుకోవాలని సూచించారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

More in Local