← Back to news

క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉంటేనే సినిమా చేస్తా!

By A.Ajay· 13h ago
క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉంటేనే సినిమా చేస్తా!

మలయాళ నటి అనస్వర రాజన్ ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. తను కేవలం సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కథలు ఒప్పుకోనని, తన క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉంటేనే సినిమా చేస్తానని చెప్పారు. ప్రస్తుతం తను నటిస్తున్న ‘ఇట్లు అర్జున’ సినిమాలో కీర్తి పాత్ర తనకు చాలా నచ్చిందన్నారు. ఆ పాత్రలో ఎనర్జీ, అమాయకత్వం, ఆనందం ఉంటాయని చెప్పారు. ఈ సినిమాలో అర్జున్‌ పాత్రకు మాటలు ఉండవు. అతడి మౌనం, భావాలతోనే కథ ముందుకు సాగుతుందని.. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు అనస్వర చెప్పారు.

More in Entertainment