← Back to news

మొక్కలు నాటిన విద్యా కమిటీ సభ్యులు

By padam Subramanyam· 1d ago· Jallipeta, Palamaner, Chittoor
మొక్కలు నాటిన విద్యా కమిటీ సభ్యులు

చిత్తూరు జిల్లా గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటైన విద్యా కమిటీ సభ్యులు మొక్కలు నాటారు. పలమనేరు ప్రకృతి కన్వీనర్ మల్లిచెట్ల దేవేంద్ర, ప్రధానోపాధ్యాయుడు చెంగల్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. విద్యా కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల ప్రగతికి కృషి చేయాలని కోరారు.

More in Local