సొంత వ్యాపారంతో యువత కొత్త దారులు వెతుక్కోవాలి

గవర్నమెంట్ జాబ్స్ కోసమే వెయిట్ చేయకుండా యూత్ సొంతంగా బిజినెస్ మొదలుపెట్టి ఇతరులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని తొర్రూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మచ్చ సురేష్ చెప్పారు. తొర్రూరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ బొలగాని రాములు ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వ్యాపారంలో ఉన్న కొత్త అవకాశాలను పట్టుకుని, క్రియేటివ్ ఆలోచనలతో స్కిల్స్ పెంచుకోవాలని స్టూడెంట్స్‌కి సలహా ఇచ్చారు. ఈ ఈవెంట్‌లో కాలేజీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.



