గిరిజనాభివృద్ధిపై ఎంపీ రివ్యూ

అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణి, కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం కలెక్టరేట్‌లో దిశా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ప్రగతిపై రివ్యూ చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర నిధులు సద్వినియోగం చేయాలని ఎంపీ సూచించారు. రోడ్లు, తాగునీరు, ఉపాధి హామీ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పార్లమెంట్ నిధుల పనులు వేగవంతం చేయాలని, పెండింగ్ పనులపై నివేదికలు ఇవ్వాలని చెప్పారు.



