అమరావతిలో పోలీస్ డాగ్స్ పాసింగ్ అవుట్ పరేడ్

అమరావతిలో పోలీస్ శాఖకి చెందిన 23వ బ్యాచ్ కెనైన్స్ హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. చీఫ్ గెస్ట్‌గా వచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత గెలుపొందిన డాగ్స్, హ్యాండ్లర్లకు అవార్డులు ఇచ్చి అభినందించారు. డ్రగ్స్, బాంబులను కనిపెట్టడం, క్రైమ్స్, ప్రకృతి విపత్తుల టైమ్‌లో హెల్ప్ చేస్తాయని చెప్పారు. ఎండనక, వాననక కష్టపడే హ్యాండ్లర్ల సేవలను మెచ్చుకున్నారు. ఈ ఈవెంట్‌లో డీజీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.



