20 నెలలుగా జీతాల్లేవు.. స్వీపర్ల ఆందోళన
TG: తెలంగాణ సెక్రటేరియట్‌లో స్వీపర్లు, స్కావెంజర్లు ఆందోళనకు దిగారు. 20 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గర నిరసన తెలిపారు. తమతో పని చేయించుకుని.. జీతాలు అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిని కలిసినా.. సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. తెలంగాణవ్యాప్తంగా సుమారు 4 వేల మంది స్వీపర్లు, స్కావెంజర్లు.. 20 నెలలుగా జీతాలు అందటం లేదని ఆవేదన చెందుతున్నారు.


