← Back to news

పులి మృతి కేసులో అటవీ అధికారి సస్పెండ్

By dk· 13 Aug 2026· నంద్యాల జిల్లా
పులి మృతి కేసులో అటవీ అధికారి సస్పెండ్

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పెద్దపులి మృతి ఘటన కలకలం రేపింది. వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని పులి మృతి చెందగా, అటవీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కళేబరాన్ని దహనం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇందిరేశ్వరం బీట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెహబూబ్ బాషాను సస్పెండ్ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లోనే పులి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. బాషాతో పాటు ఏడుగురు ప్రొటెక్షన్ వాచర్ల ప్రమేయంపైనా విచారణ జరుగుతోంది.

More in AP