← Back to news

నేషనల్ హైవేపై భారీ రాస్తారోకో

By DK· 30 Jul 2026· ప్రకాశం జిల్లా
నేషనల్ హైవేపై భారీ రాస్తారోకో

AP: పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల వద్ద నిల్వ ఉన్న సరకును కొనుగోలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పొగాకు రైతులు ప్రకాశం జిల్లాలో ఆందోళనకు దిగారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో త్రోవగుంట, టంగుటూరు టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పొగాకుపై ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తున్నా రైతులకు న్యాయం జరగడం లేదని నాయకులు ఫైరయ్యారు.

More in AP