ఆత్మకూరులో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఆత్మకూరు పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న దీక్షల్లో సీపీఎం నాయకులు, స్థానిక పేదలు, ప్రజలు పాల్గొన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలం కేటాయించి, ఇంటి పట్టా అందించాలని వారు డిమాండ్ చేశారు. పేదల సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించాలని కోరారు.



