ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదు

AP: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం భారీ ఆందోళన చేపట్టారు. మార్కాపురం–ఎర్రగొండపాలెం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర ప్రకటించడంతో పాటు రూ.1000 కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. నిరసనతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.



