ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతులు ఇబ్బంది పడకుండా జిల్లాలోని 20 మండలాల్లో 183 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని, సకాలంలో ధాన్యం సేకరించాలని అధికారులను సూచించారు.



