సుప్రీంకోర్టు: ఇంట్లో ఉండే మహిళలు ‘నేషన్ బిల్డర్స్’!

ఇంట్లో ఉండే మహిళలు (హోమ్‌మేకర్స్) దేశాన్ని నిర్మించే ‘నేషన్ బిల్డర్స్’ అని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పొద్దున నుంచి రాత్రి దాకా హోమ్‌మేకర్స్ చేసే ఉచిత సేవలకు ఎంతో విలువ ఉందని కోర్టు పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో వారు చనిపోతే.. వారి కుటుంబానికి ఇచ్చే నష్టపరిహారం కోసం వారి శ్రమ విలువను కనీసం నెలకు రూ.30,000గా లెక్కించాలని స్పష్టం చేసింది. వారి కష్టాన్ని తక్కువ చేసి చూడకూడదని చెప్తూ. ఇలాంటి కేసులను ఏడాదిలోపే తేల్చాలని కోర్టు ఆదేశించింది.



