ఇవాళ రాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల డ్రైవర్లు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఇచ్చిన పిలుపుమేరకు ఈ బంద్ కొనసాగుతోంది. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రవాణా రంగ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ కార్మికుల సమ్మె విరమించుకోవాలని, వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.


