← Back to news

విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతపై కేంద్రం కీలక ఆదేశాలు

By DK· 26 Aug 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతపై కేంద్రం కీలక ఆదేశాలు

AP: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి మొత్తం CISF బలగాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మూడునెలల నోటీసు వ్యవధి అనంతరం 2026 నవంబర్ 17 నుంచి సెక్యూరిటీ, ఫైర్ వింగ్‌లలోని CISF సిబ్బందిని వెనక్కి తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్లాంట్‌లో భద్రతా విభాగంలో 1,033 మంది, అగ్నిమాపక విభాగంలో 298 మంది CISF సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉపసంహరణకు ముందు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి CISFకు రావాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించాలని కేంద్రం ఆదేశించింది.

More in AP