← Back to news

స్పీచ్ ఇస్తూ.. స్టేజ్‌పైనే కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి

By Mahesh· 15 Aug 2026· తిరుపతి
స్పీచ్ ఇస్తూ.. స్టేజ్‌పైనే కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి

AP: తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈరోజు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తరువాత స్పీచ్ ఇస్తుండగా కళ్లు తిరిగి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ ఆయనను పట్టుకున్నారు. డాక్టర్స్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ చేసారు. బీపీ తగ్గడంతో అస్వస్థతకు గురైనట్లు డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం మంత్రి హెల్త్ కండిషన్ నిలకడగా ఉందని వెల్లడించారు.

More in AP