‘వారణాసి’ కోసం AI ని పక్కన పెట్టిన రాజమౌళి

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రూ.1,400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 120కి పైగా దేశాల్లో, 50 భాషల్లో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. డబ్బింగ్ కోసం ఎలాంటి AI వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీలు వాడకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారు. సినిమాలోని భావోద్వేగాలు సహజంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో స్థానిక యాసలోనే డబ్బింగ్ చెప్పిస్తున్నారని తెలుస్తోంది.



