పాడేరులో Red Ribbon 5K మారథాన్

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో HIV/AIDSపై యువతకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన Red Ribbon 5K Marathonలో జిల్లా కలెక్టర్ టి. నిషాంతి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. International Youth Fest–2026లో భాగంగా “Run for a Healthier, HIV-Free Tomorrow” సందేశంతో నిర్వహించిన ఈ పరుగు ప్రభుత్వ వైద్య కళాశాల, పాడేరు నుంచి హుకుంపేట మండలం బర్మంగూడ వరకు కొనసాగింది. స్థానిక యువత, కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.



