రైల్లో ఇవి కూడా దొంగతనం చేస్తున్నారా?

భారతీయ రైల్వే AC కోచ్‌లలో బెడ్‌షీట్లు, టవల్స్, దుప్పట్లు మాయమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. 2022 నుంచి 2026 మే వరకు మొత్తం 1.27 కోట్లకు పైగా లెనిన్ వస్తువులు మిస్సయ్యాయని RTI ద్వారా తెలిసింది. ఈ చోరీల వల్ల రూ.104 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు సమాచారం. ఎక్కువగా ఫేస్ టవల్స్, బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు ప్రయాణికులు తీసుకెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు రైల్వే వస్తువులను ఇంటికి తీసుకెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.



