← Back to news

5KM జెండాతో 2 వరల్డ్ రికార్డ్స్!

By sahani· 14 Aug 2026· Instagram

హర్యానాలోని పల్వల్ హైవేపై ‘హర్ ఘర్ తిరంగా’ క్యాంపెయిన్‌లో భాగంగా స్పోర్ట్స్ మినిస్టర్ గౌరవ్ గౌతమ్ నాయకత్వంలో ఆగస్టు 13న వేలాది మంది జనాల మధ్య ఏకంగా 5KM పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఒక స్పెషల్ ట్రక్కుపై అమర్చిన రోలర్ ద్వారా జెండాను అన్‌రోల్ చేస్తుంటే, ప్రజలు తమ చేతులతో పట్టుకుని ముందుకు సాగారు. ఈ అద్భుతమైన తిరంగా యాత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.