థియేటర్‌లో సినిమా చూస్తూ ఫోన్ వాడుతున్నారా?

ఈ రోజుల్లో థియేటర్లలో సినిమా చూస్తూ చాలామంది ఫోన్లు వాడటం, రీల్స్ స్క్రోల్ చేయడం, పక్కన వాళ్లతో ముచ్చట్లు పెట్టడం పెద్ద ప్రాబ్లమ్‌గా మారింది. దీనివల్ల పక్కన ఉండే ఆడియన్స్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా మిస్ అవుతున్నారంటూ మేకర్స్, మూవీ లవర్స్ ఫైర్ అవుతున్నారు. కొంతమంది డైరెక్టర్స్ అయితే, థియేటర్లలో ఫోన్ సిగ్నల్స్ రాకుండా జామర్లు పెట్టాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్తున్నారు. థియేటర్లో కొంచెం పక్కన వాళ్ళని కూడా మైండ్‌లో పెట్టుకోండి అంటూ ఇంటర్నెట్‌లో ఈ టాపిక్ ఫుల్ వైరల్ అవుతోంది.



