ప్రజాసంఘాల తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ప్రజా, పౌరహక్కుల సంఘాల నాయకుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని కాంగ్రెస్ గిరిజన, ఆదివాసి కోఆర్డినేటర్ పి. రఘు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఇబ్రహీం ఆరోపించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణకు ఎమ్మెల్యే నిధులు తీసుకువస్తే డీపీఆర్ చూపాలంటూ ప్రశ్నించడం అనుమానాలకు తావిస్తుందన్నారు.



