పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో టీడీపీ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బి బంగ్లాలో జరిగిన సమావేశంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, TTD బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. టౌన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ ఇంచార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులతో పార్టీ బలోపేతంపై చర్చించారు. గురజాల నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులపై నాయకులు సమీక్షించారు.



