← Back to news

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: KVPS

By Kamal Kumar· 1h ago· Vikarabad, Vikarabad, Vikarabad
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: KVPS

TG: వికారాబాద్ జిల్లా కొండాపూర్ గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న గ్రామపంచాయతీ ఖారోబార్, దళిత వర్గానికి చెందిన శ్రీనివాస్‌పై జరిగిన భౌతిక దాడిని KVPS తీవ్రంగా ఖండించింది. కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని KVPS బషీరాబాద్ మండల అధ్యక్షుడు కే. వెంకట్ డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 39m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.