రేపు జిల్లా స్థాయి కిసాన్ మేళా

నిర్మల్‌లోని FSCS ఫంక్షన్‌హాల్‌లో రేపు జిల్లా స్థాయి కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి సుజాత తెలిపారు. రైతులకు ఉపయోగపడే పలు అంశాలపై మేళాలో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం, పథకాలు, సాగు పద్ధతులపై రైతులకు వివరాలు అందించే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కిసాన్ మేళాను విజయవంతం చేయాలని DEO సుజాత కోరారు.



