రియాక్షన్ వీడియోల రచ్చ.. సోషల్ మీడియా కొత్త డ్రామా!

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల్లో Reaction Videos బూమ్‌తో కొత్త "Reaction Economy" క్రేజ్‌లో ఉంది. ఒక వీడియోపై మరో వీడియో చేస్తూ వ్యూస్, ఫాలోవర్లు, ఆదాయం పెంచుకుంటున్నారు. కానీ సరదా కామెంట్లు క్రమంగా విమర్శలు, ట్రోలింగ్, పబ్లిక్ షేమింగ్‌గా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్లు అసలు వీడియో కంటే రియాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆన్‌లైన్ చర్చలు హెల్తీ డిబేట్ నుంచి హేట్ కల్చర్ వైపు వెళ్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. సోషల్ మీడియాలో రియాక్ట్ చేసే ముందు ఫ్యాక్ట్స్ చెక్ చేయడం, బాధ్యతగా స్పందించడం ఇప్పుడెంతో అవసరం.



