← Back to news

మహిళను వేధించిన SIకి షాక్

By DK· 1 Aug 2026· కరీంనగర్ జిల్లా
మహిళను వేధించిన SIకి షాక్

TG: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని వేధింపులకు పాల్పడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట SI కదిరే శ్రీకాంత్‌ను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు 4నెలలుగా గోవా, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సిమ్‌కార్డులు ధ్వంసం చేసి వైఫై ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ కొనసాగించాడు. సాంకేతిక ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, 14రోజుల రిమాండ్ విధించింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.