దసరాకు జమ్మి ఆకులే బంగారం ఎందుకు?

దసరా రోజున జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు ఇచ్చుకోవడం మన సంప్రదాయం. మహాభారతం ప్రకారం, పాండవులు అజ్ఞాతవాస సమయంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెట్టారు. అజ్ఞాతవాసం ముగిశాక వాటిని తిరిగి తీసుకున్నారని కథ చెబుతోంది. దీంతో జమ్మి చెట్టును విజయం, శుభానికి గుర్తుగా భావిస్తారు. అందుకే దసరా రోజున జమ్మి ఆకులను బంగారంతో సమానంగా చూసి బంధుమిత్రులకు ఇస్తారు.



