యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: CI

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని మంగళగిరి గ్రామీణ CI చిరుమామిళ్ల వెంకట్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు TIDCO గృహ సముదాయాల నివాసితులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలను గౌరవించాలని, అసభ్య ప్రవర్తన, వేధింపులు, బహిరంగ మద్యపానం, రాత్రివేళ న్యూసెన్స్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు, అశాంతికి పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.




