జంతువుల ఆహారం.. బాంబుగా ఎలా?

పంటలను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి పెట్టిన ఆహారమే.. వాటికి ప్రాణాంతక ఉచ్చుగా మారుతోంది. ‘బైట్ బాంబ్స్’గా పిలిచే ఈ ఉచ్చుల్లో పేలుడు పదార్థాన్ని ఆహారం లేదా పండులో దాచిపెడతారు. జంతువు దాన్ని సాధారణ ఆహారమని భావించి కొరికిన వెంటనే నోట్లో పేలుడు జరిగి దవడ, నాలుక తీవ్రంగా దెబ్బతింటాయి. దీంతో తినలేక ఆకలితో లేదా ఇన్ఫెక్షన్‌తో చనిపోయే ప్రమాదం ఉంటుంది. అడవి పందులను లక్ష్యంగా పెట్టిన ఈ ఉచ్చులకు ఏనుగులు, ఎద్దులు వంటి ఇతర జంతువులు కూడా బలవుతున్నాయి. ఒడిశాలో ఇటీవల ఇలాంటి ఉచ్చు ఓ ఎద్దు మృతికి కారణమైంది.



